బాలీవుడ్లో ప్రముఖ నటుడైన వరుణ్ ధావన్ కు నార్త్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. హిందీ సినీ పరిశ్రమల లో అందరితో చనువుగా నడుచుకుంటాడు వరుణ్ ధావన్. అయితే తన సహ నటులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్న విమర్శలు సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాలు నుంచి వస్తూనే ఉన్నాయి. ఆలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా కియారాని ముద్దు పెట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇలా సహ నటులతో అసభ్యంగా ప్రవర్తించడం తప్పు అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో చలామణి అయ్యాయి. అయితే వీటి గురించి వరుణ్ దావత్ ఆఖరికి స్పందించారు. నేను సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్కరితోనే సమానంగానే నడుచుకుంటాను. ఆరోజు కియారాన్ని ముద్దు పెట్టుకుంది కూడా ఒక మ్యాగజిన్ షూట్ భాగంగానే తప్ప నేను ఏదో కావాలని చేయలేదు. అది ముందు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసినదే. కియారా నేను ఇద్దరం ఆ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాము.
ఇక ఆలియా భట్ విషయానికొస్తే తనూ, నేను ఎప్పటినుంచో స్నేహితులము. అది అనుకోకుండా జరిగిన విషయమే తప్ప ఉద్దేశపూర్వకంగా ఏమీ జరగలేదు. అయినా మేమిద్దరం ఇప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉన్నాము. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే తప్ప నేను ఎన్నడు అసభ్యంగా ప్రవర్తించలేదు అంటూ చెప్పుకొచ్చారు వరుణ్ ధావన్. తను హీరోగా కీర్తి సురేష్, వామికాలతో కలిసి నటిస్తున్న చిత్రం బేబీ జాన్.
ఈ సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడైన అట్లీ కథను అందించారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. తమిళంలో విజయ్ తలపతి, సమంత నటించిన తేరి సినిమా అంటే తెలుగులో పోలీసోడు సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా విడుదలకు దగ్గర కావడంతో ప్రమోషన్లు ఫుల్ జోరుగా జరుగుతున్నాయి ఈ సినిమా మరి హిందీ ఆడియన్స్ ను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.