వాట్ ఎన్ ఐడియా స‌ర్‌జీ అనాల్సిందే!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వ‌య‌సు పెరుగుతున్నా కొద్దీ చాలా కొంటెగా ఆలోచిస్తున్నారు. కొంటె ప‌నులు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు అందుబాటులో వుంటున్నారు. ప‌లు ఆస‌క్తిక‌ర పోస్టుల‌తో ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటున్నారు. ట్విట్ట‌ర్‌తో పాటు ఇన్ స్టాలోనూ బిజీగా వుంటూ వ‌రుస పోస్ట్‌లు పెడుతున్నారు.

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన బిగ్‌బి తాజాగా పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. ఓ పాత ఫొటోని షేర్ చేసిన అమితాబ్ దానికి అస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేశారు. త‌ను ఇన్ స్టాలో ఎందుకు అత్య‌ధిక ఫాలోవ‌ర్స్‌ని పొంద‌లేక‌పోతున్నానో, యంగ్ జ‌న‌రేష‌న్‌కి త‌గ్గ‌ట్టుగా కామెంట్‌లు, షేరింగ్‌లు, కామెంట్స్ెందుకు పొంద‌లేక‌పోతున్నానో కొంత మంది వివ‌రించారు. నేను మిగ‌తా వాళ్ల‌లా బికినీ ఫొటోలు పోస్ట్ చేయ‌డం లేదు కాబ‌ట్టే నాకు అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ పెర‌గ‌డం లేద‌ని చెప్పారు. అప్పుడు నాకు ఈ ఫొటో గుర్తొచ్చింది. అంటూ `మ‌హాన్‌` చిత్రంలో చెడ్డీ, బ‌నియ‌న్‌పై వున్న ఓ ఫొటోని షేర్ చేశారు. ఇందులో తాను త్రిపాత్రాభిన‌యం చేశాన‌ని, ఈ సినిమా రిలీజై 37 ఏళ్ల‌వుతోందిన వెల్ల‌డించారు.

బిగ్ బి పెట్టిన ఈ పోస్ట్‌కు ప‌లువురు సెల‌బ్రిటీల‌తో పాటు నెటిజ‌న్స్ అవాక్క‌వుతున్నారు. ఓ మై గాడ్ ఏంటీ ఈ పోస్ట్ అంటూ షాక‌వుతున్నారు. కొంత మంది అభిమానులు మాత్రం మీ స‌మ‌య‌స్ఫూర్తి సూప‌ర్‌.. ల‌వ్ య‌యు స‌ర్‌జీ అని.. వాట్ ఎన్ ఐడియా స‌ర్‌జీ అని నెటిజ‌న్స్ కామెంట్‌లు పెడుతున్నారు.