వైరల్ : “చోర్ బజార్” సినిమాపై ఇండియన్ ఆల్ టైం లెజెండరీ హీరో ట్వీట్.!

అవ్వడానికి స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు అయినా కూడా ఆకాష్ పూరి మాత్రం తనకి తాను  కస్టపడి స్టార్డం తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని తన సినిమాలు ఎంచుకుంటూ వెళ్తున్నాడు. అలాగే తాను లేటెస్ట్ గా చేసిన చిత్రం “చోర్ బజార్”. ఇంటెన్స్ చిత్రం “జార్జ్ రెడ్డి” దర్శకుడు అయినటువంటి జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజే విడుదల కాబోతుండగా.. 

వీరి అందరికీ ఒక సర్ప్రైజింగ్ ఇండియన్ సెలెబ్రెటీ నుంచి బూస్టప్ వచ్చింది. ఆకాష్ తండ్రి పూరి జగన్నాథ్ కి గాని ఆకాష్ పూరి కి గాని టోటల్ గా పూరి కాంపౌండ్ సన్నిహితుల్లో ఇండియన్ లెజెండరీ హీరో అమితాబ్ కి ఫ్యాన్స్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ హీరో ఇప్పుడు చోర్ బజార్ సినిమాపై వారు ఇచ్చిన ట్రిబ్యూట్ పై స్పందించడం వైరల్ గా మారింది. 

ఈ సినిమాలో అమితాబ్ పై తెరకెక్కించిన సాంగ్ పై తాను స్పందిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సాంగ్ చెప్పడానికి  రావట్లేదని, నా ప్రేమ, గౌరవం ఎప్పుడూ మీతో ఉంటాయి అని ఆ సినిమాపై రిప్లై ఇచ్చారు. దీనితో ఈ బిగ్ ట్వీట్ వైరల్ అవుతుంది. చిత్ర యూనిట్ కి కూడా నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.