చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. వారం రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదు అవుతుండంతో అధికారులు లాక్‌డౌన్ విధించారు. చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 397 కరోనా కేసులు నమోదుకాగా, జిలిన్ ప్రాంతంలోనే 98 కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత గరిష్ట స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో చాంగ్‌చున్ సిటీ మొత్తం ప్రస్తుతం లాక్‌డౌన్ విధించారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూసి వేశారు.