Tamil Nadu Government: తమిళనాడులో ఆరోజున పూర్తిస్థాయి లాక్ డౌన్

Tamil Nadu Government: రాష్ట్రాలు కరోనా కల్లోలంలో చిక్కుకున్నాయి. అంతే కాకుండా దేశంలో కూడా కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. తాజా గా వచ్చిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ దెబ్బకు కరోనా కేసులు ఒక్కసారిగా జెట్ స్పీడ్‌తో దుసుకుపోతున్నాయి. తాజాగా జరిగిన క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వలన కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగింది. అసలే చలికాలం కావడం వలన కరోనా కేసులు తారాస్థాయికి చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న తరుణంలో… తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే కట్టడి మార్గమని నిర్ణయం తీసుకున్న స్టాలిన్ సర్కార్.. ఈ నెల 9 నుంచి లాక్ డౌన్ ను అమలు చేయనుంది.

ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని అందరిని అవాక్కయేలా చేసింది. ఎందుకంటే కొన్ని రాష్టాల ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టాయి కానీ.. ఇంతవరకు లాక్ డౌన్ అయితే విధించలేదు. ఈ నెల 9 నుంచి వచ్చే అన్ని ఆదివారాలు తమిళనాడులో పూర్తిస్థాయిలో ఉంటుందని లాక్ డౌన్ ఉంటుందని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కాలేజీలు పూర్తిగా మూసివేయాలని.. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ తో నడపాలని ప్రభుత్వం సూచించింది. మరిన్ని ఆంక్షలు విధించడం పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.

కాగా తమిళనాడు రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 2,731 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అటు ఓమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తమిళనాడు సర్కార్. త్వరలోనే పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఉండబోయే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.