లిప్ లాక్స్..బెడ్ రూమ్..బాత్ రూమ్ కి క‌రోనా తాళం?

లిప్ లాక్స్..బెడ్ రూమ్..బాత్ రూమ్ కి క‌రోనా తాళం?

క‌రోనావైర‌స్ వ్యాప్తితో మన‌షికి మ‌నిషే శ‌త్రువ‌య్యాడు. ఇప్పుడంతా సామాజిక దూరం పాటించి వైర‌స్ ని త‌రిమి కొట్టాలి. ఇద అంద‌రిపై ఉన్న బాధ్య‌త‌. దీనిలో ఎక్క‌డ తేడా జ‌రిగినా సీనే రివ‌ర్స్ అవుతుంది. అయితే ఇలా ఎన్నాళ్లు? అంటే సరైన క్లారిటీ కూడా లేదు. కొవిడ్-1 కి వ్యాక్సిన అందుబాటులోకి వచ్చే స‌రికి ఏడాది నుంచి ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌డుతుని అంటున్నారు. అలాగైతే అప్ప‌టివ‌ర‌కూ సోష‌ల్ డిస్టెన‌స్ పాటించ‌ల్సిందేనా? ఒక‌ర్ని ఒక‌రు క‌ల‌వ‌డానికి వీలు లేదా? అంటే ఏమో ఎవ‌రికి తెలుసు ! అన్న‌ట్లే ఉంది తాజా స‌న్నివేశం. స‌ర‌గ్గా ఇదే డౌట్ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సుజిత్ స‌ర్కార్ ని ఇబ్బంది పెడుతోంది.

ఇప్ప‌టికే లాక్ డౌన్ కార‌ణ‌గా ఎక్క‌డ షూటింగ్ లు అక్క‌డ నిలిచిపోయాయి. మే 3 వ‌ర‌కూ లాక్ డౌన్ అమ‌లులో ఉంటుంది. ఆ త‌ర్వాతైనా షూటింగ్ లు ప్రారంభ‌మ‌వుతాయా? లేదా? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. అయితే లాక్ డౌన్ ఎత్తేసినా సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం మాత్రం ఎవ‌రికి వారు విధిగా చేయాల్సిన ప‌ని అని అంటున్నారు. ఎందుకంటే లాక్ డౌన్ ఎత్తిన త‌ర్వాత ప్ర‌భుత్వ ఆంక్ష‌లేవి ఉండ‌వు. అప్పుడు ఎవ‌రి ఆరోగ్యం వారే కాపాడుకోవాలి. అందులో భాగంగా ప్ర‌భుత్వ సూచ‌న‌లు పాటిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే సినిమా వాళ్ల‌కు అదే పెద్ద త‌ల‌బొబ్బిగా మారింది.

సినిమాల్లో హీరో, హీరోయిన్ మ‌ధ్య లిప్ లాక్ లు..బెడ్ రూమ్ సీన్లు రియ‌ల్ గానే ఉంటాయి. స‌న్నివేశం పండ‌టం కోసం డూప్ లేకుండా రియ‌ల్ గానే న‌టించేస్తున్నారు. అలాంట‌ప్పుడు సినిమా వాళ్ల‌కు సూచ‌న‌లు పాటించ‌డం ఎలా అని స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఆవేద‌న చెందుతున్నాడు. ఇక తెలుగు సినిమాలోనూ మ‌నోళ్లు రొమాన్స్ విష‌యంలో ఎంత స్పీడ్ గా ఉంటున్నారో? చెప్పాల్సిన ప‌నిలేదు. ఛాన్స్ రావ‌డం ఆల‌స్యం…పెదాల‌ను జుర్రుకోవ‌డానికి హీరో-హీరోయిన్లు ఇద్ద‌రు రెడీ గా ఉంటున్నారు. మ‌రి వైర‌స్ కి భ‌య‌ప‌డి బెడ్ రూమ్..బాత్ రూమ్ ..లిప్ లాక్ ల‌కి కొన్నాళ్లు తాళ వేస్తారేమో చూడాలి.