లాడ్ డౌన్ ఎఫెక్ట్: మ‌హేష్ టెన్నీస్ ప్లేయ‌ర్

లాడ్ డౌన్ ఎఫెక్ట్: మ‌హేష్ టెన్నీస్ ప్లేయ‌ర్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు టెన్నీస్ ఆడితే ఎలా ఉంటుందో? ఎవ‌రైనా ఎప్పుడైనా చూసారా? అయితే మేము చూసామ‌నే అంటాం. లాక్ డౌన్ నేప‌థ్యంలో సెల‌బ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా హైద‌రాబాద్ జూబ్లిహిల్స్ లోని త‌న ఇంటిలోనే కాల‌క్షేపం చేస్తున్నాడు. స‌మ‌యం దొరికితే సూప‌ర్ స్టార్ ఫ్యామిలీతో ఎంత‌గా ఎంజాయ్ చేస్తారో? చెప్పాల్సిన ప‌నిలేదు. కుమార్తె సితార‌, త‌న‌యుడు గౌతమ్ తో క‌లిసి చిన్న పిల్లాడిలా మారిపోతారు.

తాజాగా అదే ప‌నిచేస్తున్నారు. గౌత‌మ్ తో క‌లిసి వ‌ర్చువ‌ల్ టెన్సీస్ ఆడుతున్నారు. షాట్స్ కొట్టిన‌ప్పుడ‌ల్లా ఎగురుతూ చిన్న‌పిల్లాడిలా మారిపోతున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మ‌హేష్ టెన్నీస్ ఆడుతుంటే తండ్రికే అలా ఆడాలి డాడి అంటూ ప‌క్క‌నుండి సితార స‌ల‌హాలు ఇస్తోంది. మ‌హేష్ ను మునుపెన్న‌డు ఇలా చూడ‌ని అభిమానులు ఇప్పుడా ఆవిడియో చూసి తెగ సంబ‌ర‌డ‌పిపోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హేష్ సితార‌తో ఎక్కువ‌గా దోబూచులాడిన వీడియోలే ఎక్కువ‌గా వైర‌ల్ అయ్యాయి. తొలిసారి గౌత‌మ్ తో టెన్నీస్ లో ఇలా పోటీ ప‌డుతూ…ఆట‌లో లీన‌మై ఆడుతుంటే! అభిమానులు చూడ‌ముచ్చ‌ట‌గా ఉందంటూ ఆస్వాదిస్తున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్  ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. స్ర్కిప్ట్ సహా అన్ని ప‌నులు పూర్తి చేసి సెట్స్ కు వెళ్దామ‌నుకుంటోన్న స‌మ‌యంలో క‌రోనా దాడి చేయ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ లాక్ డౌన్ ఎత్తివేత త‌ర్వాత అంతా రోడ్డెక్కేది. అప్ప‌టి వ‌ర‌కూ అంతా మ‌హేష్ లలా ఏదో ప‌ని పెట్టుకుని కాల‌క్షేపం చేయాల్సిందే.