లాక్ డౌన్ నేప‌థ్యంలో పోలీస్ కాన్సెప్ట్.. రాజుగారు అంతేగా!

లాక్ డౌన్ నేప‌థ్యంలో పోలీస్ కాన్సెప్ట్.. రాజుగారు అంతేగా!

క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్ర‌భుత్వం విధించిన లాక్ డౌన్ ప‌టిష్టంగా అమ‌ల‌వుతోందంటే దానికి కార‌ణం పోలీసులే. రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తూ ప్రాణాల‌కు సైతం తెగించి విధులు నిర్వ‌హిస్తున్నారు. విధి క‌న్నా సేవ ముఖ్యం! అన్న నిర్వ‌చ‌నం ఇస్తున్నారు. పోలీసులు.. డాక్ట‌ర్లు మ‌హ‌మ్మారీకి భ‌య‌ప‌డ‌క‌ ఎదురెళ్లి మ‌రీ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. వృత్తి కంటే ఏదీ ఎక్కువ కాదంటూ ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్ పోలీసుల ప‌నితీరును మోగాస్టార్ చిరంజీవి ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. ఓ కానిస్టేబుల్ త‌నయుడిగా మెగాస్టార్ పోలీసులంద‌రికీ సెల్యూట్ చేసి గౌర‌వ మ‌ర్యాద‌లు అందుకున్నారు.

అటు క‌రోనా వైర‌స్ పై టాలీవుడ్ లో ప‌లు క‌థ‌లు సిద్దమ‌వుతున్నాయి. కోలీవుడ్ 19 విప‌త్తు వ‌ల్ల‌ 21 డేస్ లాక్ డౌన్ ని ఉద్దేశిస్తూ ఓ సినిమా కూడా తెర‌కెక్కుతోంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు పోలీసుల‌ సేవ‌ల్ని ప్ర‌శంసిస్తూ ఓ సినిమా చేస్తామ‌ని ప్రామిస్ చేసారు. మోహ‌దీప‌ట్నంలోని పోలీసు సిబ్బందికి శానిటైజ‌ర్లు.. మాస్కులు పంపిణీ చేసిన అనంత‌రం రాజుగారు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. పోలీసుల గొప్ప‌త‌నం గురించి చాలా కాలంగా ఓ సినిమా చేయాల‌నుకుంటున్నా. ఇప్పుడా స‌మ‌యం వ‌చ్చింద‌నిపించింది. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎంత ప‌టిష్టంగా లాక్ డౌన్ కోసం శ్ర‌మిస్తున్నారో? చూస్తున్నాం. అందుకే వాళ్ల కోసం ఓ సినిమా చేస్తున్నా. ఇప్ప‌టికే క‌థ సిద్ద‌మైంది. ఏ క్ష‌ణ‌మైనా ప‌ట్టాలెక్కొచ్చ‌ని రాజుగారు అన్నారు.

ఆయితే రాజుగారేమి తెలివి త‌క్కువ ప్లాన్ తో లేరు! అంటూ నెటిజ‌నులు కామెంట్లు పెడుతున్నారు. లాక్ డౌన్ నేప‌థ్యం బ‌ర్నింగ్ టాపిక్… పైగా జ‌నాలకు బాగా క‌నెక్టివిటీ పాయింట్. అందుకే దీనిపై మంచి స్క్రిప్టులు రాసేందుకు స్కోప్ ఉంటుంది. అందుకే ఈ సీజ‌న్ ని రాజుగారు ఇలా ప్లాన్ చేసార‌ని విశ్లేషిస్తున్నారు. ఆల్రెడీ తెర‌కెక్కి రిలీజ్ ల‌కు రెడీగా ఉన్న వాటి విష‌యంలో దిల్ రాజులో బెంగ ఉన్నా.. కొత్త క‌థ‌లు వండ‌డంలో మాత్రం ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. ఏదైతేనేం ప్ర‌య‌త్నం మంచిదేగా.. అంతేగా అంతేగా!