ఫ్యాన్స్ ఎన్ని గింజుకున్నా మెయిన్ స్విచ్ శంకర్ దగ్గరే..!

ramcharan-director-shankar-wrap-up-the-first-schedule-of-rc15001

టాలీవుడ్ హీరోస్ నుంచి ఉన్న పలు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ చేంజర్” కూడా ఒకటి. మరి దీనిని పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం కోసం మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఇప్పటికీ ఈ సినిమా నుంచి సరైన అప్డేట్స్ అయితే ఇక పెద్దగా ఏవి లేవు దీనితో తాను చెయ్యడానికి ఏమి లేదని అంతా శంకర్ గారి చేతిలోనే ఉందని నిర్మాత దిల్ రాజు ఎప్పుడో చేతులెత్తేశాడు. అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఏడాది అయ్యిపోయింది.

దీనితో సోషల్ మీడియాలో అభిమానులు మొన్ననే దారుణమైన నెగటివ్ ట్రెండ్ అది కూడా శంకర్ లాంటి దర్శకుడు మీదనే చేశారు. అయినా కూడా చిత్ర యూనిట్ నుంచి చిన్న మూమెంట్ కూడా లేదు. దీని బట్టి అసలు శంకర్ నుంచి ఎలాంటి కంట్రోల్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

తాను చెప్పనిదే సినిమా నుంచి ఏ అప్డేట్ కూడా బయటకు రాదని ఇప్పుడు చాలా మందికి అర్ధం అయ్యి తీరాలి. మరి శంకర్ అయితే ఎప్పుడు అప్డేట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ఏంటో చూడాలి. ఇంకా ఈ భారీ సినిమాలో కియారా అద్వానీ, అంజలిలు హీరోయిన్స్ గా నటించగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.