వైరల్ వీడియో : ఆ వార్తలు రాసినందుకు దిల్ రాజు సీరియస్ వార్నింగ్ 

తెలుగు సినిమా దగ్గర ఉన్న టాప్ మోస్ట్ నిర్మాతల్లో అయితే దిల్ రాజు కూడా ఒకరు. మరి దిల్ రాజు సినిమాలు కానీ తన కమిట్మెంట్ లాంటి వాటి కోసం టాలీవుడ్ మూవీ లవర్స్ కి బాగా తెలిసే ఉంటుంది. కాగా దిల్ రాజు నిర్మాతగా మాత్రమే కాకుండా ఇప్పటివరకు ఎన్నో వందల చిత్రాలని డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు.

అయితే ఈసారి సంక్రాంతి పోరులో మాత్రం పరిస్థితులు చాలా రసవత్తరంగా మారాయి. దిల్ రాజు  తెలంగాణాలో గుంటూరు కారం సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీనితో పాటుగా మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి కానీ తనకి థియేటర్స్ సింగిల్స్ స్క్రీన్స్ ఎక్కువ ఉండడంతో అవి వేరే సినిమాలకి ఇవ్వకుండా తనకే బ్లాక్ చేసుకుంటున్నాడు అని.

ఇంకా మన సినిమాలు ఉన్నప్పటికీ తమిళ సినిమా డబ్బింగ్ హక్కులు కొని వాటికి థియేటర్స్ ఇస్తున్నారని టాక్ ఈ రెండు రోజుల్లో వైరల్ గా మారింది. దీనితో దిల్ రాజుపై మరోసారి విపరీతమైన నెగిటివ్ వచ్చింది. కాగా ఇవన్నీ చూసి విస్తుపోయిన దిల్ రాజు సహనం కోల్పోయారు ఈసారి నుంచి తన మీద కావాలని న్యూస్ లు స్ప్రెడ్ చేస్తే తాట తీస్తా అని కూడా వార్నింగ్ ఇచ్చారు.

కాగా ఇపుడు ఓ వీడియో కూడా వైరల్ గా మారింది. తన డిస్ట్రిబ్యూషన్ విషయంలో తప్పుడు వ్రాతలు రాసిన ఓ వ్యక్తిపై దిల్ రాజు చాలా సీరియస్ అయ్యి వార్నింగ్ ఇస్తున్న విజువల్స్ ఇందులో కనిపిస్తున్నాయి. దీనితో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.