ఇన్సైడ్ టాక్ : “దేవర” కోసం ఆ ఇద్దరు టాప్ డిస్ట్రిబ్యూటర్స్ పోటాపోటీ?

ఒక ఊహించని డిజాస్టర్ తర్వాత ఏ దర్శకుడికి అయినా కూడా ఒక టాప్ మోస్ట్ హీరో ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా వరకు జరగదు. కానీ ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం దీనిని బ్రేక్ చేస్తూ గత సినిమా ఎలా ఉన్నా కూడా ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి మరీ భారీ హిట్ కొట్టడం తనకి అలవాటు. అలా ఎన్టీఆర్ చేసిన అరవింద సమేత భారీ హిట్ కాగా ఇప్పుడు చేస్తున్న “దేవర” కూడా అదే కోవలోకి వస్తుంది.

కాగా ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ చేసిన గత చిత్రం ఆచార్య భారీ డిజాస్టర్ అయినప్పటికీ “దేవర” లో విజువల్స్ చూసి ఒకొక్కరు షాకయ్యారు. దీనితో దేవరపై హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లగా సినిమా బిజినెస్ కి సంబంధించి భారీ పోటీ ఇపుడు నెలకొన్నట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. కాగా ఇపుడు దేవర నైజాం హక్కులకు సంబంధించి గట్టి యుద్ధమే జరుగుతుందట.

ఈ సినిమాని సొంతం చేసుకోడానికి ప్రస్తుత ప్రత్యర్ధులు దిల్ రాజు అలాగే మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారట. తాజాగా గుంటూరు కారం, హనుమాన్ చిత్రాల హక్కులు వీరు తీసుకొని బిజినెస్ పరంగా చిన్న కోల్డ్ వార్ లో పాల్గొన్నారు. ఇక ఇపుడు దేవర కోసం పోటీ పడుతున్నారని వినికిడి. మరి చివరికి ఈ సినిమా ఎవరికి సొంతం అవుతుందో చూడాలి మరి.