కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో సంచలనమవుతోన్న పేరు. ఇండస్ర్టీ చాటు మాటు వ్యవహారాలను పబ్లిక్ చేస్తూ రచ్చ రంభోలా చేస్తున్నాడు. హీరోయిన్ల ఎఫైర్లు..దర్శక, నిర్మాతలు, హీరోల చాటు మాటు రాసలీలను బహిర్గతం చేస్తూ సంచలనమవుతున్నాడు. హీరోయిన్ల అందరి జాతకాలు నాకు తెలసునంటూ….నేను మాత్రం సుద్ద పూసనంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ ఆరోపణలో నిజా నిజాలు ఎంటో తెలియదు గానీ! తాజాగా యాంకర్ కమ్ హీరోయిన్ రష్మీ గౌతమ్ గురించి ఆసక్తికర సంగతులే రివీల్ చేసాడు. రష్మీతో తనకెలా పరిచయం ఏర్పడింది? ఇండస్ర్టీలో అమ్మడు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వూలో బహిర్గతం చేసాడు.
`థాంక్స్` అనే సినిమాతో రష్మీ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో ఆకాష్ హీరో. ఆ సినిమా, డైరెక్టర్, నిర్మాత రష్మీని చాలా ఇబ్బందులకే గురిచేసారుట. లైంగిక ఇబ్బందులు సహా మానసికంగాను ఆ అమ్మాయిను ఎంతో వేధించారని అన్నాడు. సహనం కోల్పోయిన రష్మీ పరిశ్రమకి ఎందుకొచ్చాను రాబాబు అంటూ లబోదిబో మందని రాకేష్ మాస్టర్ రవీల్ చేసారు. ఓ రోజు నైట్ షూటింగ్ సమయంలో రష్మిక, ఆకాష్ మీద సీన్లు చేస్తున్నారుట. అప్పుడే రాకేష్ మాస్టర్ కి అమ్మడితో పరిచయం ఏర్పడిందిట. ఆ తర్వాత ఢీ జోడీలో ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు షోలో భాగంగా తాను ఒక విషయం చెబితే ఆర్గనైజర్లు వాటిని ఎడిట్ చేయించి..లేనిపోనివి పెట్టి చూపించారుట.
తన మాటలు ఉంచితే షోకి డ్యామేజ్ జరుగుతుందని భావించారమో ఏమో గానీ ఆయన గారు ఒకటి చెబితే..నిర్వాహకులు మరోలా చూపించారుట. అవన్నీ కూడా రష్మికకు తెలుసు. కానీ ఆ సమయంలో తాను కూడా మౌనంగా ఉందని…అప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం మానేసానని తెలిపాడు. అయితే ఇండస్ర్టీ కష్టాల గురించి చాలాసార్లు రివీల్ చేసింది. తనకెదురైన లైంగిక అనుభవాలు..తనపట్ల ఆకతాయిలు ప్రవర్తన గురించి పలుమార్లు రివీల్ చేసి కన్నీళ్లు చెమర్చిన సందర్భాలున్నాయి. ఇక సినిమా వాళ్ల గురించి అమ్మడు చేసిన కామెంట్లు క్యాస్టింగ్ కౌచ్ టైమ్ లోనూ సంలచనంగా మారిన సంగతి తెలిసిందే. మరి రష్మిక పై లైంగిక దాడికి యత్నించిన ఆ దర్శక, నిర్మాతలెవరో?