కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి

టాలీవుడ్ లో టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి రాకేశ్ మాస్టర్. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రాకేశ్ మాస్టర్ ఆట, ఈటీవీ ఢీ డాన్స్ రియాలిటీ షోతో వెలుగులోకి వచ్చారు. తరువాత సినిమాలకి కొరియోగ్రాఫర్ గా కూడా మారాడు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరి సినిమాలకి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు.

అయితే తరువాత ఏమైందో అవకాశాలు దూరమయ్యాయి. రాకేశ్ మాస్టర్ దగ్గర శిష్యులుగా చేసిన శేఖర్, జానీ ప్రస్తుతం సౌత్ లో స్టార్ కొరియోగ్రఫర్స్ గా ఉన్నారు. చాలా సందర్భాలలో శేఖర్ మాస్టర్ తన గురువు రాకేశ్ మాస్టర్ అని ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే గత కొన్నేళ్ళుగా మరల యుట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలతో బయటకొచ్చిన రాకేష్ మాస్టర్ కెరియర్ పరంగా ఎందుకు ఫెయిల్ అయ్యింది చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఎస్ ఆర్ కె ఎంటర్టైన్మెంట్స్ అనే యుట్యూబ్ ఛానల్ నడుపుతూ రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కొరియోగ్రాఫర్ గా అతని ప్రస్థానం ముగిసిపోయిన కూడా ప్రస్తుతం యాక్టివ్ గానే ఉంటూ సందడి చేస్తున్నారు. అయితే మద్యానికి భాగా బానిస అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ ఈవెంట్ కోసం రాకేష్ మాస్టర్ విశాఖ వెళ్ళారు.

తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకి గురై గాంధీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారం రోజులుగా వైద్యులు అతనికి ట్రీట్మెంట్ అందిస్తూ బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా తీవ్ర అస్వస్థతకి గురై హాస్పిటల్ లోనే మృతి చెందారు. రాకేష్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఆయన కెరియర్ లో సుమారు 1400 సినిమాలకి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. యంగ్ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరికి సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ కంపోజ్ చేశారు. 2000 నుంచి 2010 మధ్యలో రాకేష్ మాస్టర్ టాలీవుడ్ లో ఒక వేవ్ సృష్టించారు. తరువాత మెల్లగా అతని ఇమేజ్ తగ్గుతూ వచ్చింది.