బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్- దీపికా పదుకొణే ప్రేమాయణం గురించి చెప్పాల్సిన పనిలేదు. నాలుగేళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ జంట పెళ్లి బంధం తో ఒకటవ్వాలని చూసారు. కానీ ఆ బంధం కొన్నాళ్లే కే వీగిపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో దూరమయ్యారు. తర్వాత దీపిక మరో నటుడు రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వాళ్ల ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుంది. దీపికతో బ్రేకప్ తర్వాత రణబీర్ ఆలియా భట్ తో ప్రేమలో పడ్డాడు. ఈ జంట కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోతున్నారని ప్రచారం సాగింది. అదే రీతిన విడిపోయారు! అన్న ప్రచారం అంతకంతకు వేడెక్కింది.
కారణం ఏదైనా అధికారికంగా ఇద్దరు బ్రేకప్ చెప్పుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి కలిసే ఉన్నారని మెజార్టీ వర్గం భావిస్తోంది. అయితే దీపిక తో రణబీర్ వీడిపోయినప్పుడు మానసికంగా ఎంతో కృంగిపొయాడని…ఆత్మ హత్యకు సైతం యత్నం చేసాడని ప్రచారం సాగింది. ఈ క్రమంలో డ్రగ్స్ కి బానిసైనట్లు ..ఆ లైఫ్ నుంచి మళ్లీ బయటకు రావడానికి కొన్ని నెలలు సమయం పట్టిందని ఓ ఇంటర్వూలో తెలిపాడు. అయితే దీపిక-రణబీర్ వీడిపోవడానికి కారణం అనేది ఒకటుంటుందిగా. ప్రేమికులు విడిపోయిన తర్వాత మాత్రం కారణాలు అంత తొందరగా బయటకు రావు.
కానీ ఈ జంట విడిపోవడంలో రణబీర్ తల్లి నీతు కపూర్ కీలక పాత్ర పోషించిందని ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై రణబీర్ స్పందించాడు. తన తల్లి కారణంగా దీపికకు దూరం కాలేదని.. తన వ్యక్తిగత విషయాల్లో తల్లి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ప్రేమ విలువేంటో అమ్మకు బాగా తెలుసునని తెలిపాడు. దీపికతో విడిపోవడంలో తప్పు నాదైనా కావొచ్చు..తనదైనా కావొచ్చు. కానీ అది గడిచిన గతం. ఎవరి జీవితంలో వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ఆమె నాకెప్పుడు మంచి స్నేహితురాలేనని రణబీర్ తెలిపాడు.