అయితే… నాగ్ అశ్విన్ వినాయక చవితి సందర్భంగా వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాగ్ అశ్విన్ తన ‘ప్రాజెక్ట్ కే’ సినిమా ఎంత గొప్పగా ఉండబోతోందో చిన్న క్లూ ఇచ్చాడు. వినాయక చవితి సందర్భంగా ప్రాజెక్ట్ కే స్క్రిప్ట్‌ను గణనాథుడి వద్ద పెట్టేశాడు నాగ్ అశ్విన్. ఇక ఆయన రాసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి.
ఒకప్పుడు వేద వ్యాసునికి మహా భారతాన్ని రాయడానికి సహాయం చేశారు.. ఇప్పుడు మా భారతానికి కూడా మీ ఆశీర్వాదం కావాలి.. విఘ్నేశ్వరా.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని నాగ్ అశ్విన్ అన్న పోస్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ‘ప్రాజెక్ట్ కే’ ని మహాభారతంతో పోల్చడంతో ఆ రేంజ్ కథ ఉంటుందని అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇంకొందరు …ఈ సినిమా లో ప్రభాస్ పాత్ర మహాభారతం లో కర్ణుడు పాత్ర టైప్ లో ఉండబోతోందని ఎవరికీ తోచినట్టు వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు.
అలాగే టైమ్ ట్రావెల్ కథాంశంతో ఆసక్తికరమైన కథాకథనాలతో ‘ప్రాజెక్ట్ కె’ అభిమానుల్ని అలరించబోతోందని చెప్తున్నారు. మహాభారత కాలంలోకి వెళ్లి ప్రభాస్ వస్తాడని చెప్తున్నారు.
ఇదిలా ఉంటే ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ లో ‘కె’ అంటే కల్కి అని కొంతమంది అంటున్నారు. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేసేందుకు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పాడుకొనే, దిశా పటాని నటిస్తున్నారు.