Deepthi Sunaina – Shannu: షన్నుతో బ్రేకప్ గురించి ఏమాత్రం బాధపడని దీప్తి… దీప్తి రచ్చ మామూలుగా లేదుగా…!

Deepthi Sunaina – Shannu:గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమపక్షులుగా విహరిస్తున్నటువంటి షణ్ముఖ్, దీప్తి సునైనా గత కొద్ది రోజుల క్రితం వీరి ప్రేమకు పుల్ స్టాప్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న తరువాత ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట బ్రేకప్ చెప్పుకోవడంతో చాలామంది వీరి సోషల్ మీడియా ఖాతాలపై దృష్టిసారించారు.

ఈ క్రమంలోనే దీప్తి సునయన తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక డాన్స్ వీడియోని షేర్ చేశారు.ఇలా సంతోషంతో దీప్తి సునయన డాన్స్ చేయడంతో చాలా మంది ఈమెలో షణ్ముఖ్ కి చెప్పానన్న బాధ ఏమాత్రం కనబడలేదని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే దీప్తి సునైనా ఈ డాన్స్ రిహార్సల్ ఓ కార్యక్రమం కోసం చేస్తున్నారని తెలుస్తోంది. స్టార్ మా నిర్వాహకులు బిగ్ బాస్ ఉత్సవం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అందరూ పాల్గొననున్నారు.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్ లు డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం దీప్తి సునైనా ఈ డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదీ ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇలా దీప్తి, షణ్ముఖ్ జస్వంత్ ఈ కార్యక్రమం ద్వారా మరోసారి కలవనున్నట్లు తెలుస్తోంది.