రైతు పాత్రలో కుర్ర హీరో

సినీ పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో కథ అంశం రాజ్యమేలుతూ ఉంటుంది. ఒకప్పుడు కుటుంబ కధలు ఆ పైన ప్రేమ కధలు మొన్న మధ్య థ్రిల్లర్ చిత్రాలు ఇప్పుడు తాజాగా రైతు ప్రాధాన్య సినిమాలు వస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన ‘మహర్షి’ నుంచి నేడు ‘కౌసల్య కృష్ణమూర్తి’ దాకా రైతు జీవితం ప్రధానంగా సినిమాలు వచ్చాయి ఆదరింపబడ్డాయి కూడా. సరిగ్గా దీనినే పట్టుకున్నాడీ కుర్ర హీరో. తన తదుపరి చిత్రంలో తానె ఒక రైతు పాత్ర పోషిస్తున్నాడు.

అతనెవరో కాదు హీరో శర్వానంద్. తాజాగా ‘రణరంగం’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా తరువాత ఒక రీమేక్ సినిమా ఉండగా ‘శ్రీకారం’ అంటూ మరో సినిమా ప్రారంభం కూడా అయింది. ఈ సినిమాలోనే రైతుగా కనిపించనున్నాడు. కిశోర్‌రెడ్డి దర్శకుడు. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ తిరుపతి, అనంతపురంలో జరగనుంది.