ఎప్పుడూ తన సినిమాలో ఎదో ఒక కొత్తదనాన్ని చూపించాలనుకునే హీరో విక్రమ్. అది వరకు ‘ఐ’ సినిమాలో హీరో అయ్యి ఉండీ అతను వేసిన జంతువూ లాంటి గెటప్ ను వేయడానికి ఏ హీరో సమ్మతించరు. కానీ కధ కోసం విక్రమ్ ఆ సాహసం చేసాడు. సరే ఇక ఆ చిత్రం ఫలితం మాత్రం మరోలా ఉంది అనుకోండి.
అలాంటిదే ఇప్పుడు విక్రమ్ తన కొత్త చిత్రంలో ఏకంగా 25 గెటప్పులతో మన ముందుకు రానున్నాడు. అది వరకు కమల్ ‘దశావతారం’ లో పది, అప్పుడెప్పుడో అక్కినేని 9 వేషాలు వేశారు. కానీ ఇప్పుడు విక్రమ్ చేసేది ప్రపంచ సినీ చరిత్రలోనే రికార్డు అని చెప్పాలి.
ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ వారంలోనే మొదలు కానుంది.