రేపే నాని గ్యాంగ్ లీడర్ టీజర్

నాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ విజయంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు అలాగే విడుదల అవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అయన కొత్త చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఒకనాటి చిరంజీవి హిట్ సినిమా టైటిల్ తీసుకుని సినిమా చేయడం సాహసమనే చెప్పాలి. కానీ నానికి దర్శకుడు, కధ మీద ఉండే పట్టు ఎలాంటిదో మనకు తెలిసి ఉండడం వల్ల ఈ సినిమా పట్ల అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు కాగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నాని సరసన ఒక కొత్త అమ్మాయి తెలుగు తెరకు పరిచయం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ జులై 24 , ఉదయం 11 గంటలకు విడుదల కానుంది