రామ్ చరణ్ ఇచ్చిన సలహాతోనే తారక్ ఆ నిర్ణ‌యం తీసుకున్నాడా?

టాలీవుడ్‌ యంగ్ జనరేషన్‌లో టాప్‌ ఫాంలో ఉన్న హీరోల్లో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌. వీరిద్ద‌రూ బ‌య‌ట కూడా ఫ్రండ్సే. నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన తారక్‌, తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. నటుడిగా ఫుల్‌ ఫాంలో ఉన్న ఎన్టీఆర్‌ ఇప్పుడు కొత్త బాధ్యతలకు సిద్ధమవుతున్నాడన్న వార్త టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం హీరోగా ఎన్టీఆర్‌ కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉంది. వరుస హిట్స్‌తో పాటు వరుసగా వంద కోట్ల గ్రాస్‌ సాధిస్తూ టాప్‌ హీరోగా దూసుకుపోతున్నాడు. నటుడిగా ఎన్టీఆర్‌ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది.

అరవింద సమేత, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల్లో ఎన్టీఆర్‌ నటనకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. కమర్షియల్ హీరోగా సత్తా చాటుతూనే నటుడిగానూ తిరుగులేదనిపించుకుంటున్నాడు తారక్‌.నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నాడు నందమూరి అందగాడు. త్వరలోనే సొంత నిర్మాణ సంస్థను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ కూడా స్టార్ట్‌ అయిపోయింది.

మెగా హీరో రామ్‌ చరణ్‌ సలహా మేరకే ఎన్టీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి చిరు హీరోగా రెండు సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలకు భారీగా లాభాలు కూడా రావటంతో ఎన్టీఆర్‌ను కూడా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాలని సూచించాడట.ఎన్టీఆర్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించటంపై అధికారిక ప్రకటన రాకపోయినా బ్యానర్‌ పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ, కుమారులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌లలో ఒకరి పేరు కలిసి వచ్చేలా బ్యానర్‌ పేరు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. భార్గవ్‌ హరి ప్రొడక్షన్స్, అభయ్‌ హరి ఆర్ట్స్‌ అనే పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏ పేరును ఎన్టీఆర్‌ ఫైనల్‌ చేస్తాడో చూడాలి.