రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ హాట్ ట్రీట్‌!

ప్ర‌పంచం మొత్తం క‌రోనా వైర‌స్ ఎక్క‌డ త‌మ‌కి సోకుతుందో… ఏంటీ మా ప‌రిస్థితి అని భ‌యంతో వ‌ణికిపోతుంటే కొంత మంది మాత్రం ఈ పానిక్ సిట్యువేష‌న్‌ని త‌మ ప‌బ్లిసిటీకి ఉప‌యోగించుకుంటున్నారు. దీని ద్వారా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ర‌ల్డ్ వైడ్‌గా ల‌క్ష‌ల్లో ప్రాణాల్ని హ‌రిస్తోంది. వాతావ‌ర‌ణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియ‌ని అయోమ‌యంలో జ‌నం వుంటే రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ మాత్రం ఈ సంద‌ర్భాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటోంది.

`చిరుత‌` సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ సోయ‌గం నేహాశ‌ర్మ గ‌త కొంత కాలంగా బాలీవుడ్‌తో పాటు పంజాబీ చిత్రాల్లో న‌టిస్తూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. ఎంత‌కీ త‌న‌కు పేరు రాక‌పోవ‌డంతో గ్లామ‌ర్ షోతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌, ఇన్ స్టాని ఇందుకు వేదిక‌గా వాడుకుంటూ ఇంట‌ర్నెట్‌ని హీటెక్కిస్తోంది.

తాజాగా నేహాశ‌ర్మ పెట్టిన ఓ ఫొటో, పోస్ట్ నెటిజ‌న్స్‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. క‌రోనా వైర‌స్‌తో అంతా భ‌యందోళ‌న‌కు గుర‌వుతుంటే రిలాక్స్ ఆ భ‌యాల‌న్నీ ప‌క్క‌న పెట్టండి. అంద‌రికి ఆనంద‌క‌ర‌మైన సోమ‌వారం. ఇంట్లోనే వుండండి. సుర‌క్షితంగా వుండండి అంటూ ఓ హాట్ ఫొటోని షేర్ చేసింది. నేహాశ‌ర్మ తీరు చూసిన నెటిజ‌న్స్ అంతా అవాక్క‌వుతున్నారు.