రాంచ‌ర‌ణ్ ముందు జాగ్ర‌త్త‌… మాములుగా లేదుగా?

రాంచ‌ర‌ణ్ కెరీర్ స్టార్టింగ్‌లోనే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌గ‌ధీర చిత్రంతో రికార్డును బ్రేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వీరద్ద‌రి కాంబినేష్‌లో తిరిగి ఆర్ ఆర్ ఆర్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ ఈ సినిమాలో అల్లూరిసీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి ఆఖరుకు షూటింగ్ ను ముగించనుందని సమాచారం. దీంతో చెర్రి తన నెక్స్‌ట్ సినిమా పై ప్లాన్స్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది `వినయ విధేయ రామ` సినిమాతో వచ్చిన చెర్రి… బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆ సినిమాపై విపరీతంగా ట్రోల్స్ రావటంతో ఆయ‌న అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పటికే కథలు వింటున్న చెర్రి జనవరి లో ఏదో ఒక కథను ఫైనల్ చెసే ఆలోచ‌న‌లో ఉన్నారు. మరో వైపు కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా రాంచరణ్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది.