ఒకప్పుడు టాలీవుడ్ చిత్రసీమను ఒక ఊపు ఊపింది విజయశాంతి. ఇటు హీరోయిన్‌గా ఎంతోమంది అగ్ర కధానాయకుల సరసన హీరోయిన్‌గా నటించడమే కాకుండా..లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకుంది. టాలీవుడ్‌లోనే లేడీ అమితాబ్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజకియాల్లో యాక్టివ్ అయి నిధానంగా సినిమాలను తగ్గించింది. మళ్ళీ ఇప్పుడు సరిలేరు చిత్రం నుంచి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి.
దాదాపుగా 13ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చినా కూడా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఆమె కథలో కీలకమైన భారతి అనే కాలేజీ ప్రొఫెసర్ పాత్ర చేశారు. ఆ పాత్రలో తన మార్కు పవర్ ఫుల్ నటనతో ఆకట్టుకున్నారు. కాగా ఈ చిత్రం కొరకు విజయశాంతి తీసుకున్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హీరోయిన్ రష్మిక కంటే కూడా తన రెమ్యూనరేషన్ ఎక్కువట. ఈ విషయాన్ని విజయం శాంతి స్వయంగా చెప్పుకొచ్చారు.
ఇటీవలె సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ లో విజయశాంతి ని సరిలేరు నీకెవ్వరు కోసం మీ రెమ్యూనరేషన్ ఎంతని అడుగగా.. మహేష్ తరువాత ఎక్కువ రెమ్యూనరేషన్ నాదే అన్నారు. అంటే ఆమె పరోక్షంగా హీరోయిన్ రష్మిక కంటే తానే ఎక్కువ తీసుకున్నట్టు ఒప్పుకున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే విజయ శాంతి ఈ చిత్రం కొరకు 1.5 కోట్ల కు పైగా అందుకొని ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. కమ్ బ్యాక్ సినిమాకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో సినీ ప్రముఖులు మరోపక్క ఆశ్చర్యపోయారు. విజయశాంతి, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించారు. ఆమె కోసమే ప్రత్యేకంగా ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ రాసుకున్న అనిల్ రావిపూడి పట్టుబట్టి మరీ ఆమెను ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటింపజేశారు. విజయశాంతిని సినిమాల్లోకి తీసుకురావాలని ఎంతోమంది దర్శకులు ప్రయత్నించినా చివరకు అది అనిల్ రావిపూడి సాధ్యమైంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది అనిల్ అదృష్టమనే చెప్పాలి.