రకుల్ కు అతనంటేనే బాగా ఇష్టమట

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన బ్యూటీ రకుల్‌ప్రీత్ కు యూత్ స్టార్ విజయ్ దేవరకొండ అంటేనే ఇష్టమట. ఈ విషయాన్ని ఇటీవల ఓ టీవీ ప్రోగ్రామ్‌లో రకుల్ చెప్పింది. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్ వంటి వారు సాధారణంగా ఇష్టమైన హీరో అంటే తను నటించిన స్టార్స్‌లో ఎవరో ఒకరి పేరు చెప్పాలి.

అలాంటిది నవతరం హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పడం విశేషం. ప్రస్తుతం రకుల్‌ప్రీత్ తమిళంలో కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ లో నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే రకుల్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్. ఆమె ఫేట్‌ని మార్చాల్సిన సినిమా కూడా.