తన అభిమాన హీరోతో తన కోరికను నెరవేర్చుకున్న గెటప్ శ్రీను.. ఇంతకు అదేంటంటే?

గెటప్ శ్రీను జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ సుపరిచితమే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో హాస్యకరమైన పాత్రలలో తన నటనకు.. తన గెటప్ లతో గుర్తింపు పొంది గెటప్ శ్రీను గా పిలువబడుతున్నాడు. తెలుగు సినిమాలలో ప్రవేశించి హాస్య పాత్రల ద్వారా గుర్తింపు పొంది రాణిస్తున్నాడు.

గెటప్ శ్రీను ఉన్నత చదువులకోసం హైదరాబాద్ వచ్చి సినిమాలపై ఆసక్తితో సినిమా అవకాశాలు ప్రయత్నించాడు. ఇక జబర్దస్త్ షోలో వేణు టీం లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే గుర్తింపు పొంది సుడిగాలి సుధీర్ తో జతకట్టి, తర్వాత శ్రీను కాస్త నటనతో గెటప్ శ్రీను గా మారాడు. 2014లో విడుదలైన దిక్కులు చూడకు రామయ్య సినిమాతో నటుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.

ఒకవైపు జబర్దస్త్ లో నటిస్తూ మరొకవైపు సినిమా రంగంలో కూడా మంచి అవకాశాలు రావడంతో బిజీగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల కాలంలో తాను చిరంజీవి పక్కన కూర్చుని ఫ్లైట్లో జర్నీ చేయడం జరిగింది. తన అభిమాన హీరో పక్కన కూర్చుని ఇలా జర్నీ చేయడం తనకు ఎంతో ఉత్సాహం.. సంతోషం కలిగిందని దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

చిన్నప్పుడు తాను సొంత ఊరిలో ఉన్నప్పుడు చెరువులో స్నానం చేసే సమయంలో పైన వెళ్తున్న ఫ్లైట్లను చూసి తెగ ఆనందపడి ఫ్లైట్లో ప్రయాణం చేయాలి అని చాలా ఆశగా ఉండేదని చెప్పాడు. చిరంజీవితో ఇలా ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు గతంలో జరిగిన ఎన్నో మదుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని, నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదు అంటూ సంబరపడ్డాడు.

ఇక ఈ 2022 సంవత్సరంలో ఈయన కోతల రాముడు, ఆచార్య, లైగర్, భోళా శంకర్, రాజు యాదవ్, నేను మీకు బాగా కావాల్సిన వాడివి అనే చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో కాస్త బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.