తన ఫేవరెట్ హీరో ఎవరో బయటపెట్టిన సితార.. ఎవరో తెలుసా…?

ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలతో పాటు వారి పిల్లలు కూడా బాగా ఫేమస్ అవుతున్నారు. అలా ఫేమస్ అయిన సెలబ్రిటీల పిల్లలలో మహేష్ బాబు కూతురు సితార కూడా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన మహేష్ బాబు కూతురు సితార కూడా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానుల్ని కూడా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో సితార పెట్టే ఫోటోలు వీడియోలు నిమిషాలలో వైరల్ అవుతున్నాయి అంటే ఆమెకి ఉన్న ఫాలోయింగ్ గురించి మనకి అర్థమవుతుంది.

ఇదిలా ఉండగా అందరి సెలబ్రిటీల పిల్లల లాగే మహేష్ బాబు కూతురు సితారకి కూడా ఇష్టమైన హీరో తన నాన్న కాదట. సితార మహేష్ బాబు సినిమాలతో పాటు అందరి హీరోల సినిమాలు కూడా చూస్తుందట. తెలుగు తో పాటు తమిళ్, హింది భాషలలో విడుదలైన సినిమాలు చూడటం సితారకి చాలా ఇష్టం. అయితే అన్ని భాషలలో విడుదలైన సినిమాలు చూసే సితారకి మాత్రం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం సమాచారం. ఇంట్లో సూపర్ స్టార్ హీరో ఉన్నా కూడ సితార పాపకి మాత్రం రౌడి హీరోనే తన ఫేవరెట్ హీరో అని చెప్పుకొచ్చింది.

ఇక అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోయర్స్ ని సొంతం చేసుకున్న సితార ఒకవైపు క్లాసికల్ డ్యాన్స్ చేస్తూనే మరొకవైపు వెస్ట్రన్ డాన్స్ కూడా అదరకొడుతుంది. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో ‘పెన్నీ పెన్నీ’ లిరికల్ వీడియో సాంగ్ లో సితార డాన్స్ అదరగొట్టింది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించినున్నాడు. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచుకున్నారు.