ముమైత్ ఖాన్ ని ఈ క్రైమ్,సెక్స్ కంటెంట్ లోకి లాగారు

‘దండుపాళ్యం-4’  ట్రైలర్ ఇదిగో

దండుపాళ్యం నాలుగో భాగం తెలుగు కన్నడ బాషల్లో కూడా తెరకెక్కుతోంది. ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు.

కేటీ నాయక్ దర్శకత్వంలో రూపొందిన దండుపాళ్యం 4 ను నవంబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. గత చిత్రాలకు మించి మరింత హింసాత్మకంగాను, శృంగార భరితంగాను ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఈ ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది.

Dandupalyam 4 Telugu Movie TRAILER | Mumaith Khan | Suman Ranganath | 2019 Latest Telugu Movies

దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ… దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. నవంబర్ 1 న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. సుమన్‌ రంగనాథన్‌, వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, సంజీవ్‌కుమార్‌, పాత్రలు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.

నటీ నటులు : సుమన్ రంగనాథన్, ముమైత్ ఖాన్, బెనర్జీ , వెంకట్ సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్, డిఎస్ రావు, , రాక్ లైన్ సుధాకర్, బులెట్ సోము, విఠల్ రంగయన్, జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్, స్నేహ, రిచర్డ్ శాస్త్రి తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు: డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి, మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ, సాహిత్యం : భువనచంద్ర, డి ఓ పి: గిరి బెనకరాజు, నృత్యాలు: బాబా భాస్కర్, ఎడిటర్ : బాబు ఏ. శ్రీవాత్సవ – ప్రీతి మోహన్ , పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు, నిర్మాత: వెంకట్