రక్షిత్‌శెట్టి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌!

కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్‌ శెట్టి. కిరిక్‌ పార్టీ, అతడే శ్రీమన్నారాయణ , చార్లీ 777, గోధి బన్న, సాధారణ మైకట్టు వంటి చిత్రాలతో పాన్‌ ఇండియా లెవల్లో రక్షిత్‌ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రక్షిత్‌ శెట్టి తాజాగా నటించిన చిత్రం ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్‌ ఏ) రుక్మిణి కథానాయికగా నటిచింది.

ఈ చిత్రం సెప్టెంబర్‌ 01న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు యూత్‌ ఎగబడిపోతున్నారు. చాలా రోజుల తర్వాత ఓ హార్ట్‌ హిట్టింగ్‌ సినిమా చూశామని, గుండెల్ని పిండేసే సినిమా ఇదని వీడియో బైట్‌లు ఇచ్చేస్తున్నారు. దాంతో అంతలా సినిమాలో ఏముందా అని తెలుగు ప్రేక్షకులు తీవ్ర ఎగ్‌జైట్‌మెంట్‌కు గురయ్యారు.

ఈ క్రమంలో రక్షిత్‌ శెట్టిని ట్యాగ్‌ చేస్తూ తెలుగులో ఈ సినిమా డబ్బింగ్‌ చేయండంటూ కోరారు. రక్షిత్‌ సైతం ఆల్రెడీ అదే పనిలో ఉన్నా.. త్వరలో మంచి డేట్‌తో మీ ముందుకు వస్తా అంటూ తెలిపాడు. దాంతో సినీ లవర్స్‌ ఎప్పుడెప్పుడు తెలుగులో రిలీజవుతుందా అని తెగ వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్‌ తాజాగా సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు.

ఈ సినిమాను సెప్టెంబర్‌ 22న రిలీజ్‌ చేస్తున్నట్లు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సప్త సాగారాలు దాటి (సైడ్‌ ఏ) అనే టైటిల్‌తో ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.