మాసిన గెడ్డం…ముఖానికి రక్తం తో విజయ్ దేవరకొండ

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ఫస్ట్ లుక్ ఇదిగో

కెరీర్ ప్రారంభం నుంచి వరసగా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. తాజాగా మరో సరికొత్త పాత్రతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యారు. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోంది. ‘డియర్‌ కామ్రేడ్‌’వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ పోస్టర్‌లో విజయ్‌ విభిన్నంగా కనిపించారు. చేతిలో సిగరెట్‌, నోటిలో నుంచి పొగ వదులుతూ.. ముఖానికి రక్తంతో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ హీరోయిన్స్ . క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను కేఎస్‌ రామారావు సమర్పించనున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందించనున్నారు.