క్వారెంటైన్ వేళ శ్రియ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. భర్తతో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. స్పెయిన్‌లో కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ బార్సీలోనాలో వుంటున్న శ్రియ గత కొన్ని రోజులుగా భర్తతో కలిసి ఇంటి పట్టునే వుంటూ నిర్భందంలో వుంటోంది. బయటి వాతావరణం ఎంత వైల్డ్‌గా ఉన్నా ఆ వాతావరణానికి భిన్నంగా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో ఆకట్టుకుంటోంది.
తన ఫ్యాన్స్‌ని భర్తతో కలిసి ఎంటర్‌టైన్ చేస్తోంది. 2018లో శ్రియ రష్యాకు చెందిన కొశ్చివ్‌ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు కలిసి బార్సీలోనాలో వుంటున్నారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన శ్రియ తాజాగా బ్లూ డ్రెస్‌లో ఆన్ లైన్ యోగా పాఠాలు నేర్చుకుంది. యోగా ట్రైనర్‌తో కలిసి యోగా చేస్తూ అందాల విందు చేసింది. శ్రియ యోగాసనాలు వేస్తుండగా మధ్యలో కొశ్చివ్ ఎంటరయ్యాడు. దాంతో శ్రియ యోగా మరింత రసవత్తరంగా సాగింది.
ఈ క్రమంలో శ్రియ తన భర్తపై కాళ్లు పెట్టి తల క్రిందులు చేస్తూ యోగా చేసింది. ఆ తరువాత మోకాళ్లపై వెళ్లకిలా పడుకుని యోగా చేస్తంటే ఇదే అదనుగా భావించిన కొశ్చివ్ శ్రియ కాళ్లని మరింతగా పైకి లేపడంతో శ్రియ కేకలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.