ఫ్యాన్స్‌కి షాకివ్వ‌బోతున్న బాల‌య్య‌!

మ‌న హీరోలు తెర వెనుక‌, తెర ముందు అంద‌గాళ్లే. పాత్ర ఎలా వున్నా స్క్రీన్ మీద అందంగా క‌నిపించాల్సిందే. అది నిన్న‌టి మాట ట్రెండు మారింది. పాత్ర కోసం ఎలాంటి ప్ర‌యోగం చేయ‌డానికైనా వెనుక‌డ‌టం లేదు. క‌థ డిమాండ్ ఊర‌మాస్ పాత్ర‌లో కనిపించ‌డానికి ఆర్ట్ సినిమాల్లోలా పాత్ర‌కు త‌గ్గ‌ట్టు డీ గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డానికీ వెన‌కాడ‌టం లేదు. `రంగ‌స్థ‌లం`లో రామ్‌చ‌ర‌ణ్‌లా క‌థ డిమాండ్‌ని బ‌ట్టి మారిపోతున్నారు. ఫ్యాన్స్‌కి షాకిస్తున్నారు.

హీరో బాల‌య్య కూడా షాకింగ్ లుక్‌తో ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చేస్తున్నాడు. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కత్వంలో బాల‌కృష్ణ ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. మిరియాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య అఘోరాగా విచిత్ర‌మైన గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారు. వార‌ణాసిలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టారు. ఈ స‌న్నివేశాల్లో బాల‌య్య గుండుతోనే న‌టిస్తున్నార‌ట‌. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ బయోపిక్‌లో త‌ప్ప బాల‌య్య ఏ సినిమాలోనూ గుండుతో క‌నిపించ‌లేదు. బోయ‌పాటి చిత్రంలో ఏకంగా అఘోరాగా క‌నిపించ‌బోతుండ‌టం, విగ్గు లేకుండా న‌టిస్తుండ‌టం నిజంగా ఫ్యాన్స్‌కి షాకిచ్చే విష‌య‌మే.