రానా పెళ్లి ఫిక్స్.. వధువు పెద్దింటి అమ్మాయి. ముంబైకి చెందిన బిజినెస్ మ్యాగ్నెట్ ఫ్యామిలీ నుంచి ఎంపిక చేసుకున్నాడు. పేరు మిహికా బజాజ్. అయితే ఈ అనౌన్స్ మెంట్ కొందరికి మోదం కొందరికి ఖేదం. అసలు రానా ఇలా సినిమా బ్యాక్ గ్రౌండ్ కాకుండా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వధువును ఎంపిక చేయడం.. పెళ్లాడడం అందరికీ ఆమోదమేనా? అంటే కానే కాదు.
భళ్లాలదేవుడిగా పాన్ ఇండియా స్టార్ గా పాపులరైన రానాని పెళ్లాడేందుకు ఇప్పటికే బోలెడంత మంది కథానాయికలు ఆశ పడ్డారు. కానీ రానా చిక్కడు దొరకడు తరహాలో ఎవరికీ చిక్కలేదు. ఇక రానా లిస్ట్ లో ఎంతమంది భామలు ఉన్నారు? అన్నది ఓసారి ఫ్లాష్ బ్యాక్ ని తిరగతోడితే అర్థమవుతుంది. గత దశాబ్ధ కాలంగా రానా – త్రిష క్లోజ్ ఫ్రెండ్స్. కలిసి జంటగా నటించారు. ఆ క్రమంలోనే ప్రేమలోనూ పడ్డారన్న ప్రచారం జోరుగా సాగిపోయింది. అయితే రానా దానిని ఖండించినా త్రిష ఏనాడూ ఆ ప్రచారాన్ని పట్టించుకున్నది లేదు. అయితే రానాని పెళ్లాడే అవకాశం తనకు దక్కితే త్రిష వదిలి పెట్టేది కాదన్నది ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ చెప్పే మాట.
ఇక త్రిష పలుమార్లు దగ్గుబాటి ఇంట ఎంతో సాంప్రదాయబద్ధంగా కట్టు బొట్టుతో కనిపించింది. అలా కనిపించినప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వచ్చిందా? అంటూ సెటైర్లు వేశారు. ఇక తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం.. అటుపై పెళ్లి క్యాన్సిల్ అయ్యాక కూడా రానా ఆ ఇద్దరితో స్నేహంగా ఉన్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. రానా ప్రతిసారీ త్రిష తనకు మంచి స్నేహితురాలు అని కన్వే చేసేందుకే ప్రయత్నించారు. కానీ అభిమానులు అదేదీ నమ్మలేదు.
ఇక రానాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన నాయికగా శ్రీయ పేరు ఎంతో పాపులర్. రానా- శ్రీయ ప్రైవసీ మూవ్ మెంట్స్ కి సంబంధించిన ఎన్నో ఆధారాలు అంతర్జాలంలో లభ్యమవుతాయి. రానాతో శ్రీయ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉందన్న ప్రచారం కూడా ఉంది. మరోవైపు వీళ్లతో ప్రేమాయణాలు సాగిస్తూనే రానా అటు బాలీవుడ్ నల్ల కలువ బిపాసా బసుతో డీప్ గా లవ్ లో పడ్డాడన్న ప్రచారం అక్కడ హోరెత్తింది. ఈ ఎపిసోడ్స్ అనంతరం కొంతకాలం నయనతార పేరును కూడా మీడియా లైమ్ లైట్ లోకి డ్రాగ్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే నయన్ ఇమేజ్ దృష్ట్యా ఆ ప్రచారానికి పెద్దంత ఊపు రాలేదు. ఎఫైర్ అని ప్రచారం సాగించిన ప్రతిదీ ఎఫైర్ కాకపోవచ్చు. కానీ నిప్పు లేకుండా పొగ రాదు. ఇక ఎట్టకేలకు ముంబై డిజైనర్ మిహికా బజాజ్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిలయ్యేందుకు నిర్ణయించుకున్న రానాకు `తెలుగురాజ్యం` శుభాకాంక్షలు చెబుతోంది.