భ‌య‌ప‌డుతున్న త‌మిళ హీరో విజ‌య్‌!

ఉప్పెన రీమేక్ తో ప‌వ‌ర్ స్టార్ త‌న‌యుడు ఎంట్రీ!

ప్ర‌పంచ వ్యాప్తంగా‌ కోవిడ్ -19 విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా వైర‌స్ సోకిన పాజిటివ్ కేసులే. దీంతో ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని విధించాయి. దీంతో ఎక్క‌డి వారు అక్క‌డే ఆగిపోవాల్సి వ‌చ్చింది. మ‌న ఇండియాకు చెందిన వారు చాలా మంది ఇత‌ర దేశాల్లో చిక్కుకుపోయారు.

లాక్ డౌన్ ఎత్తేసే వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు ప్రారంభిం కావ‌డం క‌ష్టంగా మార‌డంతో మ‌న వాళ్లు చాలా మంది ఇండియా తిరిగి రావ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌మిళ స్టార్‌ హీరో విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ కెన‌డాలో చిక్కుకుపోయాడు. దీంతో త‌న త‌న‌యుడి ప‌రిస్థితి ఏంట‌ని హీరో విజ‌య్ భ‌య‌ప‌డుతున్నాడ‌ట‌.

అయితే కెన‌డాలో మాత్రం క‌రోనా ప్ర‌భావం అంతంత మాత్ర‌మే వుండ‌టంతో భ‌య‌ప‌డాల్సిన విష‌యం ఏమీ లేద‌ని అక్క‌డి ప్ర‌భుత్వం వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ కెన‌డాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నాడు‌. ఇటీవ‌లే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి ఆక‌ట్టుకున్నాడ‌ట‌.