ఒక్క పోలిటికల్ పార్టీ – తండ్రీ కొడుకులకి గొడవ పెట్టేసింది !

vijay and chandrashekar

 తమిళ రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఎమోషనల్ బాండింగ్ ఎక్కువగా ఉంటాయి. తమిళ్ సినిమాల మాదిరిగానే అక్కడి రాజకీయాల్లో కూడా సెంటిమెంట్ కనిపిస్తుంది. కరుణానిధి, జయలలిత లాంటి బలమైన నేతలు కనుమరుగైన తర్వాత తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొంది. దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలని అక్కడి రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు, ఇదే సమయంలో స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ కూడా తమిళ రాజకీయంలో తమ ముద్ర వేయాలని అనుకున్నారు, కమలహాసన్ పార్టీ స్థాపించిన కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు, మరోపక్క రజని రాజకీయాల్లోకి రావాలా ..? వద్దా ..? అనే మీమాంసలో ఉన్నాడు. ఆయన అభిమానులు రావాలని కోరుకుంటుంటే, రజిని మాత్రం వెనకడుగు వేస్తున్నాడు.

vijay and chandrashekar

 ఇలాంటి సమయంలో మరో స్టార్ హీరో విజయ్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ చాన్నాళ్లుగా విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ ప‌ట్ల ర‌క‌ర‌కాల ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఏకంగా ఒక రాజ‌కీయ పార్టీని ప్రారంభించారు.అందులో త‌న త‌న‌యుడి ఫొటోలు, పేరు వాడుతున్నారు. దీని ప‌ట్ల స్వ‌యంగా విజ‌య్ అభ్యంత‌రాలు వ్యక్తం చేశాడు. ఏ రాజ‌కీయ పార్టీ అయినా త‌న ఫొటోలు, పేరు వాడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని విజ‌య్ హెచ్చ‌రించాడు. దీనిపై విజ‌య్ తండ్రి స్పందిస్తూ.. త‌నను జైల్లో పెట్టినా పొలిటిక‌ల్ పార్టీ లో విజ‌య్ ఫొటోల‌ను వాడేదే అని స్ప‌ష్టం చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

 ఒక తండ్రిగా విజ‌య్ కు ఏం కావాలో త‌న‌కు తెలుస‌ని, అందుకే విజ‌య్ కోసం రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసిన‌ట్టుగా ఆయ‌న చెబుతున్నారు. విజయ్ ను ఎప్పుడు రాజకీయాల్లోకి తీసుకోని రావాలో తనకు బాగా తెలుసనీ చంద్రశేఖర్ చెపుతుంటే, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దని విజయ్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సినిమా పరంగా విజయ్ తన తండ్రి పేరుతోనే సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు, ఆ తర్వాత తన టాలెంట్ తో తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో అగ్ర హీరోగా చలామణి అవుతున్నాడు. అప్పట్లో కొడుకు సినీరంగ ప్రవేశానికి బాటలు వేసిన తండ్రి, ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి కూడా బాటలు వేయటానికి సిద్దమయ్యాడు. అయితే సినిమా రంగంలోకి విజయ్ తన ఇష్ట ప్రకారమే వచ్చాడు, రాజకీయాల్లోకి మాత్రం తనకు ఇష్టం లేదని చెపుతున్న కానీ ఆయన తండ్రి వినకుండా ఇలా వివాదాలకు కారణం అవుతున్నాడు. మరి ఈ తండ్రీకొడుకుల మధ్య రాజకీయ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి