భారీ హిట్ “బిగిల్” కి సీక్వెల్ పై అదిరిపోయే క్లారిటీ..సినిమా అతడిపై ఉంటుందట.!

Vijay

తమిళ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో దళపతి విజయ్ కూడా ఒకడు. విజయ్ సినిమాల క్రేజ్ గాని వాటికి రెస్పాన్స్ కి గాని వేరే లెవెల్లో ఉంటాయి. అలా తాను చేసిన సినిమాల్లో భారీ హిట్ అయ్యినటువంటి సినిమా “బిగిల్” కూడా ఒకటి. తెలుగులో విజిల్ పేరిట రిలీజ్ ఇక్కడా మంచి వసూళ్లతో ఆదరగొట్టారు. అయితే విజయ్ డ్యూయల్ రోల్ లో చేసిన ఈ సినిమాని యంగ్ దర్శకుడు అట్లీ స్పోర్ట్స్ అలాగే ఒక విమెన్ స్పెషల్ సినిమాగా తీసాడు.

అయితే ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రలు బిగిల్ మరియు రాయప్పన్ పాత్రల్లో కనిపించాడు. అయితే వీటిలో మంచి పవర్ ఫుల్ గా రాయప్పన్ రోల్ కనిపిస్తుంది. అయితే దీనిపై ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు రాయప్పన్ పై ఒక సెపరేట్ సినిమా ఉంటే ఎలా ఉంటుందని చిన్న ప్రశ్న రైజ్ చేశారు. దీనితో ఈ తాట్ ఒక్కసారిగా హీట్ ఎక్కించగా దీనిపై దర్శకుడు అట్లీ కూడా స్పందించాడు.

దీనిని కన్ఫర్మ్ చేస్తూ తీసేస్తే పోయే.. అంటూ రిప్లై ఇవ్వగా అది ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే ఈ సెన్సేషనల్ అనౌన్స్మెంట్ మంచి కేజ్రీగా మారిపోయింది. అయితే ఫస్ట్ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందివ్వగా నయనతార హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో చూడాలి.