`భార‌తీయుడు 2`కి క‌రోనా ఎఫెక్ట్‌!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం `భార‌తీయుడు 2`. త‌మిళంలో `ఇండియ‌న్ 2` పేరుతో శంక‌ర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధ‌ర్థ్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 1996లో ఏ.ఎం. ర‌త్నం నిర్మించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా వ‌స్తున్న `భార‌తీయుడు 2` రెగ్యుల‌ర్ షూటింగ్ చెన్నైలోని బిన్నీ మిల్స్‌లో జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే చెన్నై, హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్‌లోని కీల‌క ప్ర‌దేశాల్లో కీసీన్స్‌ని షూట్ చేశారు. చైనా, థాయ్‌లాండ్‌ల‌లో ఓ కీల‌క షెడ్యూల్ ని ప్లాన్ చేశార‌ట‌. దీని కోసం మార్చి ఎండ్‌లో కానీ ఏప్రిల్ మొద‌టి వారంలో కానీ చైనా వెళ్లాల‌న్న‌ది `భార‌తీయుడు 2` టీమ్ ప్లాన్. కానీ ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం కరోనా వైర‌స్‌. గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైర‌స్ చైనా, థాయ్ లాండ్‌ల‌ని వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. దీని కార‌ణంగా శంక‌ర్ తాజా షెడ్యూల్ని వాయిదా వేసిన‌ట్టు చెన్నై వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇలా అయితే అనుకున్న స‌మ‌యానికి `భార‌తీయుడు 2` పూర్తియి రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు.