కరోనా దెబ్బకి యావత్ ప్రపంచం పానిక్ అవుతోంది. కంటికి కనిపించని సూక్ష వైరస్ ద్వారా ఎంత విపత్తు సంభవించబోతోందా? అని ప్రజలు, నాయకులు భయంతో వణికిపోతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రత్యేకంగా పరీక్షించి మరీ తమ ఇళ్లకు వదులుతున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇటీవల బ్యాంకాక్ వెళ్లి వచ్చాడని తెలిసింది.
వినాశ్రయంలో అతన్ని టెస్ట్ చేసిన సిబ్బంది అతనికి ఎలాంటి వైరస్ సోకలేదని పంపించేశారు. అయితే అతనికి మాత్రం అనుమానం మొదలైందట. సింటమ్స్ వైరస్ సోకినట్టే కనిపిస్తున్నాయట. అయితే అతను మాత్రం బయటికి చెబితే ఎక్కడ క్వారెంటైన్ సెంటర్‌కి వెళ్లాల్సి వస్తుందేమోనని తన సొంత ఊరైన గుంటూరు సమీసంలోని పిగుడురాళ్లకు వెళ్లినట్టు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. అక్కడి అధికారులతో ముచ్చటించిన సదరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రస్తుతం పిడుగురాళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు. ఇంటకీ ఆ ఆర్టిస్ట్ ఎవరు? ఏంటన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే వుంది.