లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కీలకమైన పాత్రలో నటించి సక్సెస్ లో కీ రోల్ పోషించారు. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావడంతో రాములమ్మ అభిమానులంతా ఎంతో ఆదరించారు. “ఎప్పుడొచ్చాం కాదు..బుల్లెట్ దిగిందా లేదా?“ అన్నట్లు కంబ్యాక్ అదరగొట్టారు. రీఎంట్రీ ఫిల్మ్ తో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఇక ఆ రోల్ కోసం రాములమ్మను ఒప్పించడానికి దర్శకుడి అనీల్ రావిపూడి ఎన్ని తంటాలు పడ్డారో తెలిసిందే. రాములమ్మను కన్విన్స్ చేయడం కోసం ఒకటికి పదిసార్లు వెంబడించి స్టోరీ నేరేట్ చేసి చివరికి వెటరన్ నటికి లాక్ చేసారు.
ఈ మూవీ కోసం రాములమ్మ భారీగానే పారితోషికం తీసుకున్నారు. పాత్రలో ఇంపార్టెన్స్ చూసుకుంటూనే ఒక స్టార్ హీరోయిన్ ని మించి దాదాపు 5 కోట్లు వరకూ ఛార్జ్ చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా రాములమ్మ కొత్త సినిమాలు ఒప్పుకోవాలంటే రకరకాల కండీషన్లు..పారితోషికం డిమాండ్ లో దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందన్ని జోరుగా ప్రచారం సాగుతోంది. కొత్త స్క్రిప్ట్ లు ఒప్పుకోవాలంటే అందులో ఆమె పాత్ర హీరోకి ధీటుగా ఉండాలని.. సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించాలని డిమాండ్ చేస్తున్నారుట. అలాగే పారితోషికం కూడా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు నిర్మాతలు గుసగుసలాడుకుంటున్నారు.
దీంతో రాములమ్మ డిమాండ్ చూసి దర్శక, నిర్మాతలు వెనుదిరుగుతున్నారని సమాచారం. అలాగే ఆమె వైఖరిపై కూడా అసంతృప్తిగా ఉన్నట్లు పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు. పట్టిందే పట్టు .. విడుపు లేదు! అంటే ఎలా? అంటున్నారంతా. అయితే తాను మాత్రం ఎక్కడా తగ్గడం లేదట. చెప్పినదానికి ఓకే అంటేనే.. కమిట్ మెంట్ ఓకే అవుతుందని.. లేదంటే.. ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందేనని విసిగిపోయి అందరూ వెళ్లిపోతున్నారుట. మరి నిర్మాతల వెర్షన్ చూస్తుంటే రాములమ్మ ఎక్కడా తగ్గడం లేదనే అర్థమవుతోంది.