బికినీ లో హాట్ గా రకుల్, చూస్తే నిద్రపట్టడం కష్టమే

బికినీ ఫొటో తో రచ్చ చేస్తున్న రకుల్

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే రవితేజ, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌లాంటి స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్‌ కొట్టేసింది రకుల్. ఇటు తెలుగులో అటు హిందీ, తమిళంలో ఏడాదిలో నాలుగైదు సినిమాలతో బిజీగా గడుపుతోంది. సినిమాల విషయం అటుంచితే.. ఫిట్‌నెస్‌ విషయంలో రకుల్‌ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అందుకే ఆమెకు సోషల్‌మీడియా ఫాలోయింగ్‌ కూడా ఎక్కువగా ఉంది. ఎప్పటికప్పుడు వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌కి కూడా టిప్స్‌ ఇస్తూ ఉంటారు. అయితే ఈ సారి బికినీ ఫోటో షేర్ చేసి ఫ్యాన్స్ కు పండగ చేసేసింది.

రీసెంట్ గా నాగార్జునతో కలిసి ‘మన్మథుడు 2’లో కనిపించిన ఆమె ఇటీవలే చంద్రశేఖర్‌ యేలేటి – నితిన్‌ సినిమాకి పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. డార్జిలింగ్‌ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందనున్నట్టు సమాచారం. దాంతో నితిన్‌ – రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రకుల్‌ హిందీ, తమిళంలో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇటీవలే ఆమె మళ్లీ తెలుగుపై దృష్టి సారించింది.