surekha Vani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చక్కగా చీర కట్టుకొని అద్భుతంగా నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సురేఖ వాణి ఇటీవల కాలంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
ఇలా ఈమెకు సినిమా అవకాశాలు రాక సినిమాలలో నటించలేదా, లేకపోతే సినిమా అవకాశాలు రాలేదా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్న సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది నిజం తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అందాలన్నింటిని ఆరబోస్తూ ఈ తల్లి కూతుర్లు ఎంతో రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా విదేశాలలో బీచ్ వద్ద సురేఖ వాణి చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
47 సంవత్సరాల వయసులో ఈమె బీచ్ ఒడ్డున బికినీ వేసుకొని ఎంతో ఎంజాయ్ చేస్తూ గడిపారు ఇలా సాయంత్రం సంధ్యా సమయంలో బీచ్ ఒడ్డున ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఈమె ఈ ఫోటోలను షేర్ చేయడంతో క్షణాలలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసినా అభిమానులు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
నాలుగు పదుల వయసులో ఇలా బికినీ ధరించి బీచ్ ఒడ్డున సందడి చేయడం అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా తన వ్యవహార శైలి కారణంగా పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు.