బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యంగ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణానికి పాల్పడి బాలీవుడ్ ని షోక సంద్రానికి గురిచేసాడు. తాజాగా అదే పరశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు సయ్యద్ ఇప్తియాక్ జాక్రీ అలియాస్ జగదీప్ కన్ను మూసారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సయ్యద్ బుధవారం తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ చిత్రాల్లో తనదైన కామెడీ శైలితో ఎన్నో సినిమాలతో మెప్పించిన ఇప్తియాక్ మృతి బాలీవుడ్ కు తీరని లోటు. 1970, 80 దశకాలలో సయ్యద్ లేని బాలీవుడ్ సినిమా లేదు.
అప్పటి చిత్రాల్లో స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగారు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. అసలు పేరు కన్నా జగదీప్ గా బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన నటుడాయన. ఇక` షోలే సినిమాలో జగదీప్ రోల్ గురించి చెప్పాల్సి పనిలేదు. ఆ సినిమాలో జగదీప్ పోషించిన సూర్మా భూపాలి పాత్ర సినిమాకే వన్నె తీసుకొచ్చింది. అదే పాత్రతో 1988 లో `సూర్మా భూపాలి` టైటిల్ తో ఓ సినిమా కూడా డైరెక్ట్ చేసారు. అందులో జగదీప్ ఏకంగా త్రిపాత్రాభినయంతో మెప్పించారు. తనదైన కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగదీప్ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ఇలా వెండి తెరపై ఆయన మెరుపులు ఎన్నో. బాలీవుడ్ స్టార్ హీరోలకు తండ్రి పాత్రలను జగదీప్ పోషించారు. తాజాగా ఆయన మరణంతో బాలీవుడ్ దిగ్ర్భాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగదీప్ సమకాలికులంతా ఆయతనో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.