ఫేక్ న్యూస్‌పై స్పందించిన చిరు

క‌రోనాకే క‌ల‌వ‌రం పుట్టేలా ఫేక్ రాయుళ్లు ఫేక్ న్యూస్‌ల‌ని వైర‌ల్ చేస్తున్నారు. ఏది నిజ‌మో ఏది అబ‌ద్ధ‌మో గుర్తుప‌ట్ట‌లేనంత‌గా వార్తా ఛాన‌ళ్ల‌తో పాటు డైలీ న్యూస్ పేప‌ర్స్‌ని కూడా త‌ప్పుదారి ప‌ట్టిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. క‌రోనా కార‌ణంగా ఎప్పుడు ఎక్క‌డి నుంచి ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందా? అని జ‌నం భ‌య‌ప‌డుతుంటే ఫేక్ న్యూస్ రాయుళ్లు మాత్రం య‌ధేచ్ఛ‌గా ఫేక్ న్యూస్‌ల‌ని పుట్టించి ఎంజాయ్‌ చేస్తున్నారు.

తాజాగా సాక్ష్య‌త్తు మెగాస్టార్ చిరంజీవి త‌ల్లిపైనే ఓ ఫేక్ న్యూస్‌ని వైర‌ల్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
చిరు త‌ల్లిని పోలిక‌ల‌కు ద‌గ్గ‌ర‌గా వున్న ఓ మ‌హిళ కుట్టు మిష‌న్‌పై మాస్కులు కుడుతూ వాటిని అంద‌రికి ఫ్రీగా పంచేస్తోంద‌ట‌. ఆ విష‌యాన్ని మార్చి చిరు త‌ల్లే స్వ‌యంగా మాస్కుల్ని త‌యారు చేసి పంచిపెడుతోంద‌ని ఓ ఫేక్ న్యూస్‌ని సృష్టించారు. ఈ వార్త‌ని లోతుగా ప‌రిశీలించ‌ని వార్తా ఛాన‌ల్స్‌, వార్తా ప‌ల్రిక‌లు గుడ్డిగా న‌మ్మేసి ఆ వార్త‌ని అలాగే ప్ర‌చారం చేశారు. దీంతో చిరు అది ఫేక్ న్యూస్ అని, ఆమె త‌న త‌ల్లి కాద‌ని, అయితే క‌మ్మ‌నైన మ‌న‌సున్న ప్ర‌తి త‌ల్లీ అమ్మే అని వివ‌ర‌ణ ఇచ్చాడు.