ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త డిమాండ్‌!

అజ్ఞానంతో ఆ‌ సినిమా చేయ‌లేదు - ప‌వ‌న్‌

క‌రోనా వైర‌స్‌పై నాలుగు విభాగాలు ముందుండి పోరాటం చేస్తున్నాయి. ఇందులో డాక్ట‌ర్స్ ప్ర‌ధాన భూమిక‌ని పోషిస్తున్నారు. పోలీస్ విభాగం, సానిట‌రీ వ‌ర్క‌ర్స్ మ‌రింత‌గా త‌మ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తున్నారు. ఇక నాలుగో విభాగం జ‌ర్న‌లిస్ట్స్‌. నిర్భంధ ప‌రిస్థితుల్లోనూ ఎక్క‌డ ఏది జ‌రిగినా.. ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు త‌లెత్తినా ఆ వార్త‌ల్ని సేక‌రించి ప్ర‌జ‌ల‌కు అందించ‌డానికి శ్ర‌మిస్తున్నారు.

ఇలా ప్రాణాల‌కు తెగించి వృత్తి నిర్వ‌హ‌ణ‌లో ఇంటిని విడిచి బ‌య‌టికి వ‌స్తున్న వారి ప్రాణాల‌కు ప్ర‌స్తుతం ర‌క్ష‌ణ లేకుండా పోయింది. వార్త‌ల సేక‌ర‌ణ కోసం వెళ్లిన స‌మ‌యంలో ఎవ‌రి ఎలా వైర‌స్ అంటుకుంటుందో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అందులో చాలా మందికి హెల్త్‌ ఇన్సురెన్స్ లేదు. తాజాగా తెలంగాణ‌లో ఇప్ప‌టికే కొంత మంది పాత్రికేయుల‌కు క‌రోనా సోకిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాచి. త‌మిళ‌నాడులో 25 మందికి, ముంబైలో 50 మందికి క‌రోనా సోకిన‌ట్టు తెలిసింది. దీంతో జ‌ర్న‌లిస్టుల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ని జ‌న‌సేనా అధినేత‌, హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా డిమాండ్ చేస్తున్నారు.

`కొంత మంది జ‌ర్న‌లిస్టులు తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో నిర్భంధంలో వున్నార‌ని తెలిసింది. వారి ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకుని త‌మ విధుల్ని నిర్వ‌ర్తించాలి. త‌మిళ‌నాడులో సుమారు 25 మంది జ‌ర్న‌లిస్టులు, ముంబైలో 50 మందికి పైగా జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో వారికి ఆరోగ్య భ‌ద్ర‌త, మ‌రియు బీమా క‌ల్పించ‌డానికి ఉభ‌య తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టిపెట్టాలి. జ‌ర్న‌లిస్టుల‌కు అవ‌స‌ర‌మైన ఆరోగ్య ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని జ‌ర్న‌లిస్టు యూనియ‌న్ల‌ను, మీడియా సంస్థ‌ల‌ను అభ్య‌ర్థిస్లున్నాను` అని జ‌న‌సేనాని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.