ప్ర‌గ‌తీ ఆంటీ లుంగీ డ్యాన్స్ భీభ‌త్సం!

ప్ర‌గ‌తీ ఆంటీ లుంగీ డ్యాన్స్ భీభ‌త్సం!

ప్ర‌పంచం మొత్తం క‌రోనా కార‌ణంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ప‌క్క క‌రోనా వైర‌స్ కార‌ణంగా జ‌నాలు ఇత‌ర దేశాల్లో కుప్ప‌లు తెప్ప‌లుగా చ‌నిపోతుంటే మ‌న వాళ్లు మాత్రం క్వారెంటైన్ టైమ్‌ని ఒక్కొక్క‌రు ఒకోలా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా జ‌న‌జీవితం స్థంభించి పోవ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన సెల‌బ్రిటీలు చిత్రాలు చూపిస్తున్నారు.

తెలుగు, త‌మిళ చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్ర‌గ‌తీ ఆంటీ క్వారెంటైన్ టైమ్‌ని తెగ ఎంజ‌పాయ్ చేస్తోంది. త‌న వాళ్ల‌తో క‌లిసి లుంగీ డ్యాన్స్ చేస్తే ప్ర‌గ‌తి చేసిన ర‌చ్చ మామూలుగా లేదు.

త‌మిళ హీరో విజ‌య్ న‌టిస్తున్న `మాస్ట‌ర్‌` చిత్రంలోని ఓ మాస్ బీట్‌కు ప్ర‌గ‌తి లుంగీ ఎగ్గ‌ట్టి ఊర మాస్ స్టైల్లో స్టెప్పులు వేసిన వీడియో ఇప్ఉడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.