రెండో పెళ్లి గురించి ప్రగతి ఏమంటుందంటే…

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందలాది సినిమాల్లో నటించిన ప్రగతి గురించి గత రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రగతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని, వరుడు కూడా దొరికేసాడని పలు మీడియా వెబ్‌ సైట్‌లు రాసుకొచ్చాయి.

కాగా తాజాగా ఈ వార్తలపై ప్రగతి స్పందించింది. పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు ఇలా ఫేక్‌ వార్తలను ఎందుకు పుట్టిస్తున్నారని ఫైర్‌ అయింది. అంతేకాకుండా తనపై వస్తున్న దృష్ప్రచారలపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై వార్తలు రాసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రగతి కోరింది.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎలా రాస్తారని మండిపడింది. గౌరవమైన పొజిషన్‌లో ఉన్నప్పుడు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరింది. అంతేకాకుండా వార్తలు ప్రచురించిన సంస్థపై ఫైర్‌ అయింది. కాగా ఆ వీడియోను కొద్ది సేపటికే డిలీట్‌ చేసింది. ప్రగతి 1993లోనే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

‘శభాష్‌ రాము’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత దాదాపు తొమిదేళ్లు గ్యాప్‌ తీసుకుని ‘బాబీ’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్‌బాబు తల్లిగా టెర్రిఫిక్‌ పర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు ప్రగతి వెనక్కి తిరిగి చూసుకునే రోజు రాలేదు. బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రాజెక్ట్‌లతో తెగ బిజీ అయిపోయింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ ప్రగతి నటించింది.