వైరల్ అవుతున్న ప్రగతి డాన్స్ వీడియో.. మరీ ప్రగతితో డాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో అమ్మ, అక్క, వదిన పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రగతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలలో ఎంతో పద్ధతిగా కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం దుస్తులలో చాలా హాట్ గా కనిపిస్తుంది. ఎక్కువగా ఈమె వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ వయసులో కూడా ప్రగతి ఫిట్నెస్ కోసం జిమ్ లో చేసే వర్క్ అవుట్ లు చూసి షాప్ అవుతున్నారు.

ఇటీవల ఎఫ్ త్రీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రగతి ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. సోషల్ మీడియాలో వర్కౌట్ వీడియోలతో పాటు డాన్స్ వీడియోలను కూడా ప్రగతి షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కూడా ప్రగతి ఒక డాన్స్ వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రగతి ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌, ర్యాపర్‌ బాద్‌ షా ఊడూ అనే ట్రెండింగ్‌ సాంగ్ కు స్టెప్పులేసింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఆ వీడియోలో నటి ప్రగతితో పాటు మరో యువతి కూడా ఈ పాటకు స్టెప్పులేసింది.. దీంతో అందరూ ఈ అమ్మాయి గురించి ఆరా తీస్తున్నారు.

అయితే కొందరు మాత్రం ఆ అమ్మాయి ప్రగతి కూతురు అని అంటుంటే మరి కొందరు మాత్రం కాదని అంటున్నారు. నిజానికి ప్రగతితో పాటు డాన్స్ చేసిన యువతి ఒక తమిళ నటి.తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో బాగా ఫేమస్‌ అయిన నటి జయా మురళి కుమార్తె, స్నేహా మురళి. స్నేహ మురళి కూడా ఒక నటి. వీరిద్దరూ ఇలా చేస్తూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. స్నేహ మురళి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ డాన్స్ వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది.