‎Actress Pragathi: క్రీడా రంగంలో దూసుకుపోతున్న ప్రగతి.. పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్!

‎Actress Pragathi: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది ప్రగతి. హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలలో ఎక్కువగా నటించి మెప్పించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది. సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటుంది. కాగా మొన్నటి వరకు సినీ రంగంలో అదరగొట్టిన ప్రగతి ఇప్పుడు క్రీడా రంగంలోను అదరగొడుతుతోంది.

‎ప్రొఫెషనల్‌ పవర్‌ లిఫ్టర్‌ గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ప్రగతి. నేషనల్ లెవెల్ పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. 2024 లో సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ సాధించిన నటి ప్రగతి ఇప్పుడు ఏకంగా గోల్డ్ మెడల్ సాధించారు. కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 లో గోల్డ్ సాధించారు. దీంతో పాటు మరో రెండు విభాగాల్లో కూడా ఆమె మెడల్స్ అందుకున్నారు. దీంతో నటి నటి ప్రగతి ఆనందానికి అవధులు లేవు. స్క్వేట్ 115 కిలోలు, బెంచ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్ లిఫ్ట్ 122.5 కిలోల పోటీల్లో పాల్గొన్నారు ప్రగతి. ఇందులో గోల్డ్ తో పాటు రెండు మెడల్స్ సంపాదించారు.

https://www.instagram.com/reel/DNAYOK9yi80/?utm_source=ig_web_copy_link

‎ఇలా మొత్తంగా మూడు మెడల్స్ సాధించడంతో నటి ప్రగతి ఎమోషనల్ అయ్యారు. తనక చాలా ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె సాధించిన విజయాన్ని పంచుకున్నారు. ఈమెరకు అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. అభిరుచి, క్రమశిక్షణ, కృషి, పిచ్చి, విరిగిన హృదయం మాత్రమే దీనికి అవసరం. నా ప్రియమైన వారందరికీ టన్నుల కొద్దీ ప్రేమ తప్ప మరేమీ లేదు. అందమైన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు. నా కోచ్ @mr._uday_kat కి ప్రత్యేక ధన్యవాదాలు. @kaushik_powerlifting జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీ 2025లో బంగారు పతకం అంటూ ట్వీట్ చేశారు నటి ప్రగతి. అయితే 50 ఏళ్ల వయసులో నటి ప్రగతి జోష్ చూసి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.