కరోనా విళయతాండవం చేస్తున్న వేళ మాస్కులు ధరించి వివాహం చేసుకోలేమని ఇద్దరు తెలుగు హీరోలు నిఖిల్, నితిన్ ఈ నెల 16, 17న జరగాల్సిన తమ వివాహాలని వాయిదా వేసుకున్నారు. అయితే కన్నడ హీరో నిఖిల్ గౌడ మాత్రం పెట్టుకున్న ముహూర్తాకే వివాహం చేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ని మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
దీంతో ఎప్పుడు మే3 వస్తుందా? లాక్ డౌన్ ఎత్తేస్తారా అని జనంతో పాటు సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే లాక్ డౌన్ రూల్స్‌ని బ్రేక్ చేస్తూ నిఖిల్ గౌడ ఈ రోజు ఉదయం 9:30 గంటలకు వివాహం చేసుకున్నారు. కర్ణాటక పొలిటికల్ లీడర్ రేవన్న కుమార్తె రేవతితో ఇటీవలే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్ గౌడతో నిశ్చితార్థం జరిగింది. అయితే వివాహాన్ని ఈ నెల 17న జరపాలని ముహూర్తం నిర్ణయించారు. కరోనా వైరస్ కారణంగా పెళ్లి జరిగే పరిస్థితులు కనిపించకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో ఈ రోజు (శుక్రవారం) ఉదయం 7:30 గంటల నుంచే పెళ్లి హడావిడి మొదలైంది.
9:30 గంటల సమయంలో వీరి వివాహం జరిగినట్టు తెలిసింది. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారట. 60 నుంచి 70 మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారట. వివాహం తరువాత మధ్యాహ్నం 12 గంటలకు కొత్త దంపతులు బెంగళూరులోని నివాసానికి వెళ్లినట్టు తెలిసింది. నా శ్రేయోభిలాషులకు రెండు చేతులు జోడించి క్షమించమని వేడుకుంటున్నాను. అందరిని ఆహ్వానించాలని నాకూ వుంది. కానీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇంటి సభ్యులు తప్ప మరొకరిని పిలవలేని పరిస్థితి. ఈ విషయంలో నన్ను క్షమించండి. నా పెళ్లిని చూడాలని రూల్స్‌ని బ్రేక్ చేయకండి. మీ విషెస్‌ని పంపించండి` అని నిఖిల్ గౌడ తనని అభిమానించే వారికి విజ్ఞప్తి చేశాడు.