Allu Arjun: బెయిల్ మంజూరు… మళ్లీ నాంపల్లి కోర్టుకు వెళ్లిన అల్లు అర్జున్… ఎందుకంటే?

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నుంచి ఈయనకు ఉపశమనం లభించిందని చెప్పాలి ఇటీవల ఈయన బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో విచారణ జరగగా కోర్టు ఈయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఇలా అల్లు అర్జున్ కు బేయిల్ రావడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

నాంపల్లి కోర్టు ఈయనకు బేయిలు మంజూరు చేస్తూ 50వేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు కండిషన్లు పెట్టింది. ఈ క్రమంలోనే ఈయన తిరిగి నాంపల్లి కోర్టుకు హాజరైనట్టు తెలుస్తుంది. ఇలా కోర్టుకు వెళ్లిన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పూచీకత్తు సమర్పించడమే కాకుండా మేజిస్ట్రేట్ ఎదుట అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు కూడా చేశారు. ఇలా జడ్జ్ ఎదుట సంతకాలు చేసిన అనంతరం ఈయన నేరుగా ఇంటికి వెళ్లిపోయారు ఇలా తిరిగి ఈయన కోర్టుకు వెళ్లిన సమయంలో అల్లు అర్జున్ తో పాటు తన మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా ఈయన ప్రమేయం ఏమాత్రం లేకపోయినా అల్లు అర్జున్ ని ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అరెస్టు చేయటాన్ని ఎంతోమంది వ్యతిరేకించారు. అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారని, ఈయన అరెస్టు వెనుక రాజకీయం కుట్ర ఉంది అంటూ ఎంతోమంది విమర్శలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర ప్రకంపనలను కూడా రేపింది.

ఇలా ఎన్నో వివాదాలు నడుమ అల్లు అర్జున్ కు ఈ కేసు విషయంలో కాస్త ఉపశమనం దొరికిందని చెప్పాలి. ఇక ఈ కేసు విషయంలో ఈయనకు బెయిల్ రావడంతో ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రావాలని కోర్టు తీర్పు వెల్లడించారు. ఇలా రెండు నెలల పాటు ప్రతి వారం పోలీస్ స్టేషన్ కి వెళ్లాలి అంటూ కోర్టు తీర్పు వెల్లడించింది.