Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించింది అయితే ఈ మరణానికి పరోక్షంగా అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు తనని అరెస్టు చేసి జైలుకు పంపించారు అయితే బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఇక ఇటీవల ఈయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ తరచూ పోలీసులు ఈయనకు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు.
ప్రతి ఆదివారం తప్పనిసరిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి వ్యక్తిగతంగా పోలీసులను కలిసి రావాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసు విషయంలో పోలీసులు సైతం అల్లు అర్జున్ కు వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారిని చూడటానికి వెళ్తే మరోసారి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని అందుకే ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను చూడటానికి వెళ్ళకూడదు అంటూ ఇటీవల పోలీసులు ఒక నోటీసును జారీ చేశారు.
తాజాగా మరోసారి ఈయనకు పోలీసులు మరొక నోటీసు జారీ చేశారు. అల్లు అర్జున్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారిని చూడటానికి కనుక వెళ్లాలి అనుకుంటే ముందస్తుగా ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని పోలీసులకు సమాచారం అందజేసిన తరువాతనే హాస్పిటల్ కి వెళ్ళాలి అంటూ మరొక నోటీసు జారీ చేశారు.
ముందుగా ఈ విషయం పోలీసులకు తెలియజేస్తే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాట్లను నిర్వహిస్తామని తద్వారా హాస్పిటల్ వెళ్లాలి అనుకుంటే ఒకరోజు ముందుగానే పోలీసులకు సమాచారం అందజేయాలి అంటూ తాజాగా మరొక నోటీసు జారీ చేశారు. అల్లు అర్జున్ కు బెల్ వచ్చిందన్నమాట కానీ ఆయన అడుగు తీసి అడుగు వేయాలి అంటే కూడా పోలీసులు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ చెప్పాలి.